9 April, 2026 | 2:00 AM

క్రమశిక్షణకు మార్గం మార్షల్ ఆర్ట్స్

09-04-2026 12:10 AM

మాస్టర్ మురళీధర్ ముదిరాజ్

కరాటేలో గౌరీ శంకర్ ప్రతిభ: బ్రౌన్ బెల్ట్ సాధన

అమీర్పేట్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ఆత్మరక్షణకు అస్త్రం క్రమశిక్షణకు మార్గంగా మార్షల్ ఆర్ట్స్ నిలుస్తుందని శోటో ఖాన్ అకాడమీ మాస్టర్ మురళీధర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం అమీర్పేటలోని గురుగోవింద్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కరాటే శిక్షణ, గ్రేడింగ్ పోటీల్లో గౌరీ శంకర్ విశేష ప్రతిభ కనబరిచి ‘బ్రౌన్ బెల్ట్’ కైవసం చేసుకున్నారు.

జపాన్ షాటోకాన్ కరాటే డో కన్నింజుకు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీధర్ ముదిరాజ్, బాబు రాజ్ లు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢ త్వం లభిస్తుందని తెలిపారు. గౌరీ శంకర్ ప్రదర్శించిన నైపుణ్యాన్ని అభినందిస్తూ ఆయనకు బ్రౌన్ బెల్ట్, సర్టిఫికేట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే అసోసి యేషన్ ప్రతినిధులు, శిక్షకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.