calender_icon.png 27 July, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థాయ్‌లాండ్‌లో మార్షల్ లా

26-07-2025 12:25:19 AM

  1. కొనసాగుతున్న థాయ్-కంబోడియా యుద్ధం
  2.    15కు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, జూలై 25: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కంబోడియా సరిహద్దుల్లో ఉన్న ఎనిమిది జిల్లాల్లో థాయ్‌లాండ్ అధికారులు మార్షల్ లా విధించారు. శుక్రవారం జరిగిన కాల్పులతో దాదాపు ఒక లక్ష మంది ఖాళీ చేయాల్సి వచ్చింది.

మలేషియా మధ్యవర్తిత్వం వహిస్తున్న కాల్పుల విరమణ కు థాయ్‌లాండ్ సూత్రప్రాయంగా అ ంగీకరించింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 15కు చేరగా.. ఈ రెండు దేశాలు సౌత్ ఈస్ట్ ఆసియా(ఆగ్నేయాసియా) కూటమిలో భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం.