calender_icon.png 21 February, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా

21-02-2026 01:31:36 AM

నిజామాబాద్‌లో ఆవిష్కరణ  

నిజామాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ, శుక్రవారం సాయంత్రం మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సరికొత్త ఇ-విటారాను వరుణ్ నెక్సా తన నిజామాబాద్ షోరూమ్‌లో ఘనంగా ఆవిష్కరించింది.

ఈ కార్యక్రమంలో ఉమారాణి, మేయర్, నిజామాబాద్, మిస్టర్ నిరంజన్, (బిజినెస్ హెడ్), మిస్టర్ ప్రతీక్ గుప్తా(టీఎస్‌ఎం), మిస్టర్ శ్రీధర్ పాల్, (జనరల్ మేనేజర్), మిస్టర్ రమణ గుప్తా, (జనరల్ మేనేజర్) మిస్టర్ మధుసూధన్ యాదవ్, (అసిస్టెంట్ జనరల్ మేనేజర్)తో పాటు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇ-విటారా డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్లలో అందించబడుతుంది, ఇ-విటారా49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో వస్తుంది.

ఇది 543 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది (ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్). ఈ ఎస్‌యూవీ సిగ్నేచర్ వై -ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో బోల్ గ్రిల్-లెస్ డిజైన్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో ప్రీమియం ఇంటీరియర్లు, లెవల్ 2 ఏడీఏఎస్ 7 ఎయిర్‌బ్యాగ్లు, అధునాతన థర్మల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని కలిగి ఉంది. రూ.15.99 లక్షల నుంచి రూ. 19.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర కలిగిన ఇ-విటారా, స్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మొబిలిటీ సొల్యూషన్స్‌కు మారుతి సుజుకి నిబద్ధతను బలపరుస్తుంది. నెక్సా ఇఎడ్జి కింద - కింద ప్రత్యేకమైన ముందస్తు బుకింగ్ ప్రయోజనాలు.. 1 సంవత్సరం వరకు ఉచిత ఛార్జింగ్, రూ.50,000 విలువైన ఉచిత ఛార్జర్, ఇన్స్టాలేషన్ (31 మార్చి 2026 వరకు చెల్లుతుంది),  కాగా ఈవెంట్ సందర్భంగా టెస్ట్ డ్రైవ్లు, బుకింగ్‌లు ప్రారం భించబడ్డాయి.