calender_icon.png 1 June, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక చవితికి మాస్ జాతర

30-05-2025 12:00:00 AM

రవితేజ కెరీర్‌లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకా లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

తాజాగా నిర్మాత లు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది.   ‘ధమాకా’లో రవితేజ-తో జత కట్టిన శ్రీలీల మరోమారు ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త కాగా, విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరి స్తున్నారు.