1 May, 2026 | 4:06 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్ష

01-05-2026 12:32 AM

పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు

జగిత్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): 206 సంఘాలతో ఏర్పడిన టీజీఈజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 5వ తేదీన జిల్లా కేంద్రాములో సామూహిక నిరాహార దీక్ష (1) రోజు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు కోరారు.

జగిత్యాల్ అర్బన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాలరావుపేట్ లో పనిచేస్తూ ప ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రధానోపాధ్యాయులు బండపల్లి పవన్ కుమార్ సన్మాన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జూన్ రెండు లోపు పిఆర్సి అమలు చేయాలి పెండింగ్ బిల్లు ఒకేసారి చెల్లించాలి హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు దాదాపు పదిహేను లక్షల మంది ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు నిర్వహిస్తున్న ఈ సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు.అనంతరం బండ పెళ్లి పవన్ కుమార్ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రకళ,గ్రామ సర్పంచ్ దావ తిరుపతి,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ భారతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సత్యరాజ్, వెంకటరమణ, పెన్షనర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిచాల రవీందర్, ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.