1 May, 2026 | 3:31 AM

9న స్పెషల్ పాస్‌పోర్ట్ మేళా

01-05-2026 12:30 AM

కరీంనగర్ సామర్థ్యం 220 నుంచి 400కు పెంపు

కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో విహార యాత్రలు, పై చదువులకు విదేశాలకు పయనమయ్యేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పాస్పోర్ట్ అపాయింట్మెంట్లకు భారీగా డి మాండ్ ఏర్పడింది. దీనిని పరిగణనలోకి తీసుకొని మే 9వ తేదీన స్పెషల్ మెగా పాస్పోర్ట్ మేళా నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని 5 పాస్పోర్ట్ కేంద్రాల్లో 4 వేల అపాయింట్మెంట్లు(స్లాట్లు) విడుదల చేయనున్నారు. ఇందు లో నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేల్లో 900 అపాయింట్మెంట్లున్నాయి. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు సైతం ఈ పాస్‌పోర్ట్ మేళాలో భాగస్వామ్యం అవుతూ అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చుకరీంనగర్ పీఎస్కేలో అపాయింట్మెంట్ల పెంపు :కరీంనగర్లో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మే 4వ తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 220 అపాయింట్మెంట్లను 400కు పెంచారు కరీంనగర్ ఎంపి, కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారు.

దీంతో ప్రస్తుతం ఉన్న సాధారణ స్లాట్లు 160 నుంచి 310కి, తత్కాల్ 40 నుంచి 60కి, పీసీసీ 20 నుంచి 30కి పెరగనున్నాయి. తత్కాల్ పాస్పోర్ట్లు 2 రోజుల్లో, సాధారణ పాస్పోర్ట్ ఏడు రోజుల్లో చేతికి అందుతుందనున్నాయి. రు.ప్రతి సోమ, మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే గ్రీవెన్స్ ఆన్లైన్ ఎంక్వైరీ అపాయింట్మెంట్ల ద్వారా సమస్యలు పరిష్కరించే ప్రవట్నం చేస్తున్నారు. రెన్యువల్లో ఇబ్బందులు ఎదురైతే :పాస్‌పోర్ట్రెన్యు వల్ చేసే సమయంలో పాత పాస్పోర్ట్ ఎంట ర్ చేయడం తప్పనిసరి.

సంబంధించి దరఖాస్తుదారులుrpo.hyderabad @cpo.gov.in లో సంప్రదించాలి, రు.పా స్‌పోర్ట్ వ్యాలిడిటీ :18 సంవత్సరాల వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలు, లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. అనంతరం పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 15 నుంచి 18 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు 10 ఏళ్ల పాస్‌పోర్టును తీసుకోవచ్చు. పాస్‌పోర్ట్ రెన్యువల్ ప్రక్రియ : పాస్‌పోర్టు నిర్ణీత కాలవ్యవధి వరకు ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవడమనేది తప్పనిసరి. .