31 March, 2026 | 12:53 PM

నవంబర్ 6 నుంచి కులగణన.. పెద్ద ఎత్తున ప్రచారం

02-11-2024 12:58 PM

హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేఆదేశాల మేరకు కులగణన చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కులగణనపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. తెలంగణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కులగణన చేపట్టనుంది.