calender_icon.png 3 December, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

03-12-2025 12:00:00 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట డిసెంబర్ 2 : మండల కేంద్రంలోని ధమగ్నపూర్ గ్రామంలో ఎమ్మెల్యే  మంగళవారం మూసాపేట మండల పరిధిలోని తునికినిపూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు నాగరాజు , కార్యకర్తలు అదేవిదంగా మూసాపేట మండలానికి చెందిన బిఆర్‌ఎస్ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు  ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,

ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి  ఎమ్మెల్యే జియంఆర్  ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే నాయకత్వాన్ని మెచ్చి, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు క్ర ఎరజ్ఞితలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మూసాపేట మండల  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.