15 March, 2026 | 8:16 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు సహకారం అందించాలి

03-12-2025 12:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 2 : ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ప్రశంసా పత్రాలను అందజేశారు.

హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, గంధం నాగరాజు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.