calender_icon.png 5 February, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

05-02-2026 12:15:23 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా టీఆర్పీ నాయ కులు బీసం ఆంజనేయులు అధ్వర్యంలో  వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్య క్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చెయ్యాలి అని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి తవిటి శైలజ, మల్లేష్, శేకేరగౌడ్, నాగరాజు సురేష్, రఘు ఉన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించి కీలక నియామకాలు చేపట్టారు. బీసన్ అంజనేయులు (జిల్లా ప్రెసిడెంట్), పాశం సురేష్  (జిల్లా ప్రధాన కార్యదర్శి) గా నియమించారు. వారికి మల్లన్న నియామక పత్రాలు అందజేశారు.