9 April, 2026 | 11:47 AM

సర్పంచ్ ఎన్నికల వేళ భారీగా మద్యం పట్టివేత

10-12-2025 01:13 AM

మోర్తాడ్, డిసెంబర్ ౯ (విజయ క్రాంతి): బాల్కొండ నియోజకవర్గం లోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల చౌట్పల్లి  గ్రామంలో అక్రమంగా బెల్టు షాపు కొనసాగిస్తున్నారని, విశ్వాస నియ సమాచారం మేరకు దాడి చేయగా భారీగా మద్యం పట్టుకున్నామని, మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని సైతం పట్టుకున్నట్లు మోర్తాడ్ మండల ఎక్సైజ్ సీ.ఐ. విశ్వనాథ్ గుండప్ప, ఎక్సైజ్ ఎస్త్స్ర, మానస తెలిపారు.

సోమవారం రాత్రి గ్రామాలలో దాడులకు వెళ్లగా చౌటుపల్లి గ్రామంలో బెల్ట్ షాపులో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని, సమాచారం అందుకొని దాడులు చేయగా21, లీటర్ల ఐఎంఎల్ విస్కీ బాటిళ్లు ,32 లీటర్ల బీర్లు బాటిళ్లు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సీఐ గుండప్ప విశ్వనాథ్, మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్త్స్ర, మానసలు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ పోలీసులు, సిబ్బంది సైతం పాల్గొన్నారు.