ఫీజు బకాయిలు చెల్లించాలి
విద్యార్థుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
రామంతపూర్, అంబర్‌పేటలో భారీ ర్యాలీ ప్రదర్శన
ముషీరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(MP R. Krishnaiah) డిమాండ్ చేశారు.
ఫీజు బకాయిలు, రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రామంతాపూర్, అంబర్‌పేటలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి అనంతయ్య ఆధ్వర్యంలో మంగళవా రం విద్యార్థులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడు తూ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తి చేసిన సుమారు 4 లక్షల మం ది విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సుమారు రూ.8 వేల కోట్ల బకాయిల ను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని, స్కాలర్‌షిప్‌లను ప్రతి విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని కృష్ణయ్య కోరారు. విద్యార్థుల ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు మద్ద తు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సం ఘం నేతలు సి రాజేందర్, మేకల శ్రీనివాస్ యాదవ్, సతీష్ కుమార్, భాస్కర్‌లతో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.






