2 September, 2026 | 2:43 AM

సైదాబాద్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి

02-09-2026 | 01:28am

ఆలోచన సాధన సమితి, తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ డిమాండ్

లేకుంటే బీసీ బహుజన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): బ్రిటిషర్లను సైతం గడగడలాడించిన ధీరవనిత, స్వాతంత్య్ర సమరయోధురాలు సావిత్రిభాయి పూలె సంగం లక్ష్మీబాయిల పేరు ను సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని, ఆమె విగ్రహాన్ని సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణం, ట్యాంక్‌బండ్‌లపై ఏర్పాటు చేయాలని ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్‌రావు, తెలంగాణ స్వాభిమాన్ పరిషత్(Telangana Swabhiman Parishad) వ్యవస్థాపకులు వినయ్ కుమార్ యాదవ్‌లు డిమాండ్ చేశారు.

మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల స మావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. గొప్ప మహిళల ఔన్నత్యాన్ని బయటికి రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళా మహానీయుల పేర్లను పెట్టాలని లేకుంటే బీసీ బహుజన ఉద్యమ కారచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, మాస్ అధికార ప్రతినిధి మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, ఉపాధ్యక్షురాలు దుర్గారాణి రజక, బీసీ ఉద్యమకారులు ఒట్టె జానయ్య యాదవ్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, క్రాంతి దల్ వ్యవస్థాపకులు పృ ధ్వీరాజ్ యాదవ్, మన తొలి వెలుగు రఘు, కాలోజీ శ్రీనివాస్, టీఆర్పీ వర్కింగ్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీరజాగౌడ్, బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, రజక రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు గోపీ రజక, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ రావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడెం రమేష్ కుమార్, మట్టా జయంతిగౌడ్, మాస్ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, పీ రవి గంగపుత్ర, బ్రహ్మయ్య రజక, పృధ్వీరాజ్ ముదిరాజ్, శ్రీకాంత్ గంగపుత్ర, బాలరాజ్ యాదవ్, యాదగిరి సాగర్, కళ్యాణ్ నేత, సీ సత్యనారాయణ గంగపుత్ర, బీసీ ఫ్రంట్ ప్రెసిడెంట్ వాసుకె యాదవ్ తదితరులు పాల్గొన్నారు.