పట్టపగలే భారీ చోరీ
25-06-2026 12:00 AM
వాహనం డిక్కీలో నుంచి రూ.౩లక్షల అపహరణ
ఆదిలాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): పట్టపగలు మూడు లక్షల చోరీ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం భారీ దొంగతనం జరిగింది. తీర్పేల్లి కాలనీకి చెందిన ఇబ్రహీం (సోహెల్) బ్యాంకు నుంచి రూ.3 లక్షలు విత్డ్రా చేసి, నేతాజీ చౌక్ లోని మదీనా మసీదుకు వచ్చారు.
స్కూటీ డిక్కీలో నగదు ఉంచి నమాజ్ చేసేందుకు మజీద్ లోకి వెళ్లడు. బైటకు వచ్చి చూసే సరికి వాహనం డిక్కీలో నగదు లేకపోవడంతో లబోదిమొమన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ తెరిచి డబ్బును అపహరించారని బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.






