మట్టేవారీ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
01-03-2026 07:23 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో మట్టేవారీ రెడ్డి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడిగా మట్టే మాధవ రెడ్డిని, ఉపాధ్యక్షుడిగా మట్టే తిరుపతి రెడ్డిని, కార్యదర్శిగా గామట్టే తిరుపతి రెడ్డిని, కోశాధికారిగా మేకల అనిల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ ఐక్యత, అభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని నూతన కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామ మట్టే వారి సంఘం సభ్యులు పాల్గొన్నారు.




