14 April, 2026 | 1:14 PM

తెలుగు మహా సభలకు మారిషస్ అధ్యక్షుడు

29-12-2025 02:05 AM

ధరమ్ గోకుల్ వస్తారని గజల్ శ్రీనివాస్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో ఏపీలో 3,4,5 జనవరిలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, గుంటూరు  ప్రాంగణంలో జరుగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ గోకుల్ విచ్చేయనున్నారని డా గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలిపారు. 4 జనవరి ఉదయం 10 గంటలకు జరిగే తెలుగు వెలుగు సభకు ముఖ్య అతిథిగా సతీ సమేతంగా విచ్చేసి తెలుగు మహా సభలలో ఆయన సందేశం ఇవ్వనున్నారు. ప్రపంచ తెలుగు మహా సభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే ప్రథమమని, ఆంధ్ర ప్రదేశ్‌కు ఇది ఎంతో గౌరవమని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.