14 April, 2026 | 1:13 PM

గోషామహల్‌లో బస్తీ నిద్ర

29-12-2025 02:04 AM

గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ఉస్మాన్ షాయలోని చారి త్రాత్మకమైన శ్రీ జంగల్ విఠోబా దేవాలయం నుండి శ్రీకారం చుడుతున్నామని ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విట్టలేచిన రుక్మబా యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమానికి రూపకల్పన చేసి అనంతరం, కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా గోషామాల్ నియోజకవర్గంలో క్రియేటివ్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం, ఉద్యోగ భద్రత, సాంస్కృతికం, బస్తీలలో మౌలిక వసతులు కల్పనకు ఈ కార్యక్రమం ఎంతో దోదపడుతుందన్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమం గోషామాయిల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లో ఏడాది పాటు నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.