అంగరంగ వైభవంగా రంగనాయక స్వామి రథోత్సవం
జగదేవపూర్, మార్చి 29: జగదేవపూర్ మండల కేంద్రంలో కోరిన కోరికలు తీర్చే రంగనాయకుల స్వామి ఆలయంలో రథోత్సవంతో ముగిసిన ఉత్సవాలు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు మన్నే ప్రకాష్, ఆలయ అర్చకులు రఘు పంతులు మాట్లాడుతూ అతి పురాతన శ్రీ శ్రీ రంగనాయకి సమెత రంగానయక స్వామి ఆలయం లో ప్రతి రోజు దీప దుప నైవేద్యం తో స్వామి వారు పూజలు అందుకుంటారు అన్నారు. సంతానం లేని వారికీ ఈ ఆలయంలో మొక్కుకుంటే సంతానం కలుగుతుంది అని ఎలాంటి బాధలు ఉన్న స్వామి సన్నిధికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు తిరుతాయి అని తెలిపారు.
ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి పండుగకు నుండి మూడు రోజులు ఉత్సవాలు జరుగతాయి అన్నారు. గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు అన్నారు. రథోత్సవం అనంతరం నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనవాయితీ అన్నారు.ఆలయ నిర్వాహకులు మన్నే ప్రకాష్ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఆలయ నిర్వాహకులు మన్నే రవి,మన్నే సందీప్,మన్నే వారి కుటుంబం,అర్చకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




