యాదగిరిగుట్టలో ఘనంగా మేడే ఉత్సవాలు
యాదగిరిగుట్ట, మే 1 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలొ సిపిఐ,ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో పార్టీ కార్యాలయం వద్ద గుండ్లపల్లి గ్రామంలో హమాలి వర్కర్స్ యూనియన్,ట్రాలీ ఆటో డ్రైవర్స్ యూనియన్,చిన్న వ్యాపార సంఘాలు,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, కొండపైన ఆటో యూనియన్, టంగా కార్మిక సంఘం, లైట్ మోటార్ వెహికల్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అరుణ పతాకాలను ఎగురవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు మాట్లాడుతూ మోయలేని పని భారం 18 గంటల పని విధానం తగ్గించాలని అమెరికా దేశం చికాగో నగరంలో నిర్వహించిన పోరాటంలో అశువులు బాసిన కార్మికుల రక్త తర్పణ నుండి ఎరుపెక్కిన ఎర్రజెండా అని అమరులను స్మరించుకుంటూ మే 1న మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు.
భారతదేశంలో కూడా కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్నటువంటి హక్కులను నేడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కుల హక్కును కాలరాస్తూ నాలుగు లేబర్ కోళ్లను తీసుకువచ్చి కార్మికులకు నష్టం జరిగేటటువంటి విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్నదని తక్షణమే అ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






