2 May, 2026 | 2:52 AM

ఆస్తి కూల్చివేతకు ఎమ్మెల్యే ఒత్తిడి

02-05-2026 02:16 AM

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు బాధితురాలు ఫిర్యాదు  

కుత్బుల్లాపూర్, మే 1(విజయక్రాంతి): సు రారం మెయిన్ రోడ్డులోని 02-068/1/ఎన్ ఆర్ చిరునామాలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్తి విషయంలో చట్టవిరుద్ధ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆస్తి యజమాని శ్రీలత సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ఐఏఎస్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తాను ఆ ఆస్తికి చట్ట బద్ధ యజమానినని, రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో పాటు అన్ని యాజమాన్య పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. సంబంధిత అధికారుల ధృవీకరణకు అవసరమైన పత్రాల న్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.

అయితే, తన ఆస్తి అక్రమమని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు.ముఖ్యంగా కొంపల్లి, జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా అధికారులను ప్రభావితం చేస్తూ, ప్రహరీని కూ ల్చివేయమని ఆదేశిస్తున్నారని ఆమె వాపోయారు.ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కమిషనర్‌ను కోరుతూ, సరైన ధృవీకరణ లేకుండా ఎటువంటి కూల్చివేత చర్యలు చేపట్టవద్దని, అధికారులు చట్టానికి అనుగుణంగా మాత్రమే వ్యవహరించేలా ఆదేశించాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక అధికారులపై వస్తున్న ఒత్తిడిపై నిష్పక్షపాత విచారణ కోరారు.