ఎర్రుపాలెం మండలంలో ఘనంగా మేడే వేడుకలు
నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్వెల వీరయ్య.
ఎర్రుపాలెం మే 1(విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండలంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో గ్రామాలలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్వెల వీరయ్య సిఐటియు మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను రద్దు చేయాలని ,కార్మిక కోడులను ప్రవేశపెట్టి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దుచేసి, కార్మిక చట్టాలను అమలుపరచాలని అన్నారు.లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించాలని చూస్తుంది,
ఆనాడు ఎనిమిది గంటల పని విధానం కనీస వేతన చట్టాన్ని కార్మికులు సాధించుకున్న హక్కులను హరింప చేస్తున్నారు. నేడు ప్రవేశపెట్టిన లేబర్ కోడుల వలన కార్పొరేట్ వ్యవస్థలకు బడా కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులు 10 గంటల నుండి 12 గంటల పని విధానాన్ని , కార్మిక ఇతర హక్కులను అన్నిటిని హరింప చేస్తున్నాయి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను . నాలుగు లేబర్ కోడెలను రద్దుపరిచే వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడి పట్టించుకోవాలన్నారు కార్మిక హక్కులను దక్కించుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో డి బసవయ్య , ఎన్ పుల్లారావు, కె సుబ్బారెడ్డి అమాలీల సంఘాలు, బిల్డింగ్ వర్కర్లు , ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు, ఆశ అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు, వివిధ రంగాలు కార్మికులు, ప్రజాసంఘాల నాయకుల , పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు సానుభూతిపరులు పాల్గొన్నారు.






