1 May, 2026 | 4:00 PM

వేంసూరు లో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

01-05-2026 02:28 PM

వేంసూరు,(విజయక్రాంతి): వేంసూరు లో మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మేడే వేడుకలు శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో జెండాను సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్.రంజాన్ బీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో రంజాన్ బీ మాట్లాడుతూ,చికాగో నగర అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను విస్తృత పరచాల్సిన అవసరం ఉందని,కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక,రైతు వ్యతిరేక,ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని,ఆమె పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని,ఆనాడు 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగిన ఎనిమిది గంటల పని దినం కోసం నేడు పాలకులు పనిగంటలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని,ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని పోరాడుకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని,కార్మిక వర్గం చైతన్యమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వేంసూరు మండల నాయకులు షేక్.లాల్ మహమ్మద్,ఎస్కే.హమీద్,ఆయిష,శ్రీను,నాగరాజు,వెంకటమ్మ,అంజమ్మ,సత్యవతి,ఇట్ట వెంకటేష్,మీరావలి,సలీమ,ఆధంబీ,అమీన్,అమాన్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.