అమ్మవారి కృప అందరిపై ఉండాలి
మాజీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి
ఖైరతాబాద్,ఆగస్టు 4(విజయక్రాంతి): అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు చింతల రామచంద్రారెడ్డి కోరుకున్నారు.ఫిలింనగర్ లోని మారెమ్మ-ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆయన మంగళవారం దర్శించుకున్నారు.ఆషాడ బోనాల పండుగను పురస్కరించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలను జరిపించారు.ఈ సందర్భంగా రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బోనాలు ఎంతో ప్రత్యేకమన్నారు.
ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయా లను, గ్రామ దేవతల పట్ల భక్తి ప్రపత్తులను, వారితో సబ్బండ వర్గాలకున్న అనుబంధాన్ని వ్యక్తం చేసే పండగని అభివర్ణించారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రతి కుటుంబంపై ఉండాలన్నారు.ప్రజలంతా ఆయురారోగ్యాలు,సుఖ సంతోషాలు,అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఆలయ ప్రతినిధులు తదితరులున్నారు.






