calender_icon.png 9 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ మల్లికార్జునస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి

09-12-2025 12:52:31 AM

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని డిసెంబర్ 08 (విజయక్రాంతి) శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలంలోని బెగ్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతరలో శ్రీను బాబు పాల్గొన్నారు.

జాతరకు విచ్చేసిన భక్తుల యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.