09-12-2025 12:51:12 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ డిసెంబర్ 08 (విజయ క్రాంతి): వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు సహా పలువురు ముఖ్య నాయకులు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న సమ క్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో రుద్రవరం 1వ. వార్డు సభ్యులు బేజుగం మహేష్ 9వ. వార్డు సభ్యులు కట్ట సంపత్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ముఖ్యంగా ముంపు గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ ఏకగ్రీవ సభ్యులతో పాటు, గాలిపెళ్లి సువర్ణ స్వామి గౌడ్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.మాజీ వార్డు సభ్యులు బేజుగం దేవరాజ్, సీనియర్ నాయకులు అతికం కనకయ్య, బెజగం అంతయ్య, అంగురు మల్లయ్య, అంగురు లచ్చయ్య, బెజగం అనిల్ రాజయ్య, బెజగం అనిల్ దుర్గయ్య, తదితరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనన్న కొత్తగా చేరిన నాయకులందరినీ సాదరంగా ఆహ్వానించి, సహకారంతో ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, గ్రామశాఖ అధ్యక్షులు తాడేం శ్రీనివాస్, సర్పంచ్ అభ్యర్థి గాలిపెల్లి సువర్ణ స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య, మాజీ ఎంపీటీసీ అంకాల భూమయ్య సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.