09-12-2025 12:52:57 AM
సర్పంచ్ అభ్యర్థి చిన్న రాజన్న
కోరుట్ల, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి కోసం సేవకుడిలా పనిచేస్తానని, బ్యాట్ గుర్తుకు తమ అముల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి సర్పంచ్ అభ్యర్థి దాసరి చిన్న రాజన్న అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రచారంలో పాల్గొని చిన్న రాజన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అభ్యర్థి రాజన్న మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచుగా ముందుకు వస్తున్నట్లు, గ్రామం లో ఇంకా పరిష్కా రం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధికారులతో ప్రశ్నించి పరిష్కరించే దిశగా గ్రామంలోని పలు సంఘల నాయకులు సలహాలు సహకారం తో ముందుకు సాగుతామన్నారు.