11 August, 2026 | 1:50 AM

చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా మెక్ కల్లమ్?

11-08-2026 12:00 AM

చెన్నై, ఆగస్టు 10: ఐపీఎల్-2027 సీజ న్కు ముందు చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఫ్లెమింగ్ తో బం ధాన్ని ముగించడంతో ప్రస్తుతం కొత్త వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. హేమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చెన్నై మాత్రం విదేశీ మాజీ ప్లేయర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో మరో న్యూజిలాండర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఎంపిక చేయాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం.

మెక్కల్లమ్ ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు ఇం గ్లాండ్ వైట్బాల్ కోచ్గా మాత్రం కొనసాగుతున్నాడు. త్వరలోనే ఈ పదవి నుంచి కూడా వైదొలిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో మెక్ కల్లమ్ ఫ్రాంచైజీ క్రిక్పె దృష్టిసారించే అవకాశముంది. కాగా మెక్కల్లమ్కు సీఎస్కేతో మంచి అనుబంధం ఉంది. గతంలో ఫ్లెమింగ్ నాయక త్వంలోనే సీఎస్కే తరపున ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడిని తమ కోచ్గా నియమించా లని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.