సిరాజ్ మెరుపులు.. భారత్ విజయం
బ్యాటర్లకు ఫుల్ ప్రాక్టీస్
రాణించిన జైస్వాల్, గిల్, జడేజా
లంక ఎలెవన్‌పై 4 వికెట్లతో గెలుపు
కొలంబో, ఆగస్టు 9: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు జోష్ వచ్చింది. లం క ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు 45 ఓవర్లలో 207 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. రెండో ఇన్నింగ్స్ గిల్ బ్యా టింగ్‌కు దిగడం, జైస్వాల్ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చాయి. చివర్లో సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించడం హైలెట్‌గా నిలిచింది. మూడోరోజు భారత్ 357 పరుగుల దగ్గరే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఎలెవన్‌ను భా రత బౌలర్లు కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీసారు. ఓపెనర్ నిషాన్ మధుష్క 63, నిపున్ ధనంజయ 46, బండార 35 పరుగులతో పర్వాలేదనిపించారు.
దీంతో లంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 200 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో జడేజా 2 , గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు గిల్, జైస్వాల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. టార్గెట్ ఛేదించే ఉద్దేశంతోనే దూకుడుగా బ్యాటింగ్ చేశారు. గాయంతో రెండు రోజు లు మైదానంలోకి దిగని గిల్ ఫిట్‌నెస్ సా ధించి బ్యాటింగ్ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు రిలీఫ్ ఇచ్చింది. గిల్, జైస్వాల్ తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు.
గిల్ 44 పరుగులకు ఔటవగా, జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లకు ప్రాక్టీస్ కావాలన్న ఉద్దేశంతో జైస్వాల్ 61 రన్స్‌కు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత పంత్ 28, జురెల్ 17 పరుగులకు ఔ టవగా.. జడేజా 22 పరుగులు చేశాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా చివ ర్లో సిరాజ్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు. చివరి రెం డు ఓవర్లలో విజయం కోసం 23 పరుగులు చేయాల్సి ఉండగా సిరాజ్ నాలుగు సిక్సర్లు బాదాడు.
చివరి 6 బంతుల్లో 16 రన్స్ చే యాల్సినప్పుడు హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్ ను ముగించాడు. సిరాజ్ 15 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి టెస్టుకు ముందు భారత బ్యాటర్లందరికీ మంచి ప్రాక్టీసే లభించనట్టయింది. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో రాణించా డు. జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ 15 నుంచి గాలె వేదికగా ప్రారంభమవుతుంది.
స్కోరు బోర్డు
శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 363/8 డిక్లేర్డ్ (నిశాన్ 66, రవిందు 71, సూరియబండార 35, రత్నాయకే 39, దినుష 52 ; కుల్దీప్ యాదవ్ 2/76, జడేజా 2/64, మానవ్ సుతార్ 2/33, బ్రార్ 1/49)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 357/6 డిక్లేర్డ్ (పడిక్కల్ 142, జడేజా 63, రాహుల్ 40, మానవ్ సుతార్ 41, గుర్నూర్ బ్రార్ 36, రమేష్ మెండిస్ 2/77, అసంక మనోజ్ 2/32)
శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్ : 200/6 డిక్లేర్డ్ (నిషాన్ మదుష్క 63, ధనంజయ 46, బండార 35 ; జడేజా 2/33, బ్రార్ 2/37)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 214/4 (జైస్వాల్ 61, గిల్ 44 , సిరాజ్ 32 నాటౌట్, పంత్ 28 ; నువాంత 2/57, ఫెర్నాండో 1/34)






