పృథ్వీశ్వర్‌రెడ్డిని టార్గెట్ చేశారు
తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం మాజీ కోశాధికారి ప్రేమ్
హైదరాబాద్, ఆగస్టు 10 : తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రస్తుత సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో మాజీ కోశాధికారి ప్రేమ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. మాజీ కార్యదర్శి నార్మన్ ఐజాక్ కుట్రలో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. పృథ్వీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు.2016-19 మధ్య కాలం లో రూ.1 కోటి 60 లక్షలు నార్మన్ దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.
నార్మన్ పై సీబీఐ, ఫోర్జరీతో పాటు మొత్తం ఏడు కేసులుండగా ఎందుకు చర్య లు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనీ ప్రశ్నిం చారు. నార్మన్ కొడుకు అభిషేక్ ఏ పదవి లేకుండా అసోసియేషన్ నిధులు ఎలా విత్ డ్రా చేస్తాడన్నారు. బాస్కెట్బాల్ లీగ్‌తో సహా పృథ్వీ చేస్తున్న క్రీడాభివృద్ధి ప నులు నచ్చకే అతడిని నార్మన్ వర్గం ఇబ్బం ది పెడుతోందన్నారు. నార్మన్ పై ఒకప్పుడు కేసులు పెట్టినవాళ్లు కూడా ఇప్పుడు అతడికి వంత పాడటం చూస్తుంటే పలు అనుమానులకు తావిస్తోందిన్నారు.
గతంలో ట్రెజరర్ సంతకాలు ఫోర్జరీ చేసి నార్మన్ శాట్లో ఆడిట్ రిపోర్టులను సబ్మిట్ చేశాడనీ గుర్తు చేశారు. హైదరాబాద్ బాస్కెట్బాల్ సంఘంలోని ఒక కార్యవర్గ సభ్యుడిపై రెండు లైంగిక వేధింపుల కేసులున్నా పదవిలో ఎలా కొనసాగుతున్నాడనీ ప్రేమ్ ప్రశ్నించారు. పృథ్వీ ని సంఘం నుంచి ఎలాగైనా బయటికి పం పించి, తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది నార్మన్ వర్గం ప్రణాళికగా చెప్పుకొ చ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పృథ్వీ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పృథ్వీ తప్పు చేసుంటే అతడిని చట్టం ప్రకా రం శిక్షించాలనీ,లేదంటే ఈ కుట్రదారుల సంగతి తేల్చి, తెలంగాణ బాస్కెట్‌బాల్‌ను రక్షించాలని సూచించారు.






