23-04-2025 10:00:43 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ ముగిసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సీసీఎస్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని త్రీవంగా పరిగణిస్తున్నామని, పహల్‌గామ్‌లో ఉగ్రదాడి మృతులకు కేబినెట్ కమిటీ నివాళులర్పించింది. ప్రపంచ దేశాలన్ని ఈ ఉగ్రదాడిని ఖండించాయని, 1960 నాటి సింధూ జలాల ఒప్పందం రద్దు. అటారీ-వాఘ సరిహద్దును వెంటనే మూసివేస్తున్నామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు.
పాకిస్థాన్ పౌరులను భారత్ లోకి అనుమతించేది లేదని, ఇక్కడ ఉన్న పాక్ పర్యాటకులతో పాటు ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ మేరకు పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించేందుకు కేంద్రం కసరాతు చేస్తుంది. అటు పాక్ హైకమిషనర్ ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.