21 June, 2026 | 1:53 AM

మహిళా సాధికారత కోసం చర్యలు

21-06-2026 12:37 AM

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రభుత్వ సలహాదారు వీహెచ్

అంబర్‌పేట్, జూన్ 20 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, సమాజం ముందుకు సాగుతుందని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్ డివిజన్ మల్లికార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతె రోహిత్ ముదిరాజ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ, యూసీడీ అధికారులు రజిత రెడ్డి, అశోక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీ హనుమంతరావు మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందేలా కుట్టుమిషన్ల పంపిణీ వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక సమానత్వం కోసం మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషిని వీహెచ్ గుర్తుచేశారు.

మోతే రోహిత్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడానికి అవసరమైన శిక్షణ, సహాయం అందిస్తామని వివరించారు. శంభుల ఉషశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మహిళా శక్తి బలోపేతం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, శంభుల ఉషశ్రీ, ఏడెల్లి ప్రభాకర్, కోటం అనిల్, రావుల సుధాకర్, ఓం ప్రకాష్, ఎం సదానంద్ తదితరులు పాల్గొన్నారు.