30 June, 2026 | 2:12 AM

వర్షాలు వరదల వల్ల నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి

30-06-2026 12:23 AM

నిర్మల్, జూన్ 29 ( విజయక్రాంతి): జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే నివారణ చర్య పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో వరదల నివారణ పై సమావేశం నిర్వహించారు.

వరదలు నివారణకు ఎన్టీఆర్ రెవిన్యూ పోలీస్ శాఖ అగ్నిమాక శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ తదితర శాఖలు నష్ట నివారణ చర్యలపై ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలకుండా ముందస్తుగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ బైంసా సబ్ కలెక్టర్ ఆత్మీరా సాంకేత్ కుమార్ డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ ఆర్ డి ఓ దేవదాస్ డిఎస్పి శ్రీనివాస్ అధికారులు ఉన్నారు.