11 April, 2026 | 4:07 AM

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

11-04-2026 02:29 AM
  1. ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేలా చూడాలి
  2. వ్యవసాయ సలహాదారులు పోచారం సర్పంచులకు దిశా నిర్దేశం

బాన్సువాడ,ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో వేసవికాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఏర్పాటు చేయాలని నియోజకవర్గంలోని సర్పంచులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఆయన మాట్లాడారు.

వేసవి కాలం దుష్ట ఎండలు తీవ్రంగా ఉన్నాయని మునుముందు మరింత ఉంటాయని అందువలన పల్లెల్లో తాండాలలో పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా పైపులైన్ ఏర్పాటులో కూడా ఎలాంటి జ్ఞాపకం చేయకుండా తాగునీటికి దూరంగా ఉన్న పల్లెలు తండాలలో పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసి సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇందిర మైండ్లు సరిత గతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులతో సంప్రదింపులు చేస్తూ లబ్ధిదారులకు అవసరమైన ఇషిక సిమెంటు సలాక ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తి చేయాలని ఆయన సర్పంచులకు తెలియజేశారు.

నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్న తక్షణమే అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

182 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ 

బాన్సువాడ, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలోని 9 మండలంలోని 182 మంది లబ్ధిదారులకు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) రూ 54,34,000/- ల చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

బాన్సువాడ మండలం 33 మంది CMRF లబ్ధిదారులకు రూ 8,86,500/- బాన్సువాడ మున్సిపాలిటీ 12 మంది CMRF లబ్ధిదారులకు రూ 4,35,000/-బీర్కూర్ మండలం 17 CMRF లబ్ధిదారులకు రూ 4,57,000/- నసురుల్లబాద్ మండలం 11 మంది లబ్దిదారులకు రూ 3,05,000/-మొస్రా మండలం 11 మంది లబ్దిదారులకు రూ 2,66,000/- చందూర్ మండలం 18 మంది  లబ్దిదారులకు రూ 4,93,500/-వర్ని మండలం 23 మంది లబ్దిదారులకు రూ  6,56,500/-రుద్రుర్ మండలం 13 మంది లబ్దిదారులకు రూ 4,32,000/-కోటగిరి మండలం 22 మంది లబ్దిదారులకు రూ 5,97,000/-పోతంగల్ మండలం 18 మంది లబ్ధిదారులకు రూ 7,93,000/- ఇతరులు నలుగురు లబ్ధిదారులకు రూ 1,12,500,మొత్తం నియోజక వర్గం లో 182 మంది CMRF లబ్ధిదారులకు రూ. 54,34,000/-పంపిణీ చేసినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.   సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.