11 April, 2026 | 4:10 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన అధికారులు

11-04-2026 02:30 AM

విజయక్రాంతి ఎఫెక్ట్

నంగునూరు, ఏప్రిల్ 10: ఉపాధి హామీ పథకంలో కూలీలు ఎదుర్కొంటున్న ఇ-కేవైసీ కష్టాలు, మౌలిక సదుపాయాల పై ’విజయక్రాంతి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.‘ఉపాధి హామీ లో ఈ కేవైసి కష్టాలు‘ అంటూ వచ్చిన శీర్షిక పై సానుకూలంగా స్పందించిన నంగునూరు ఎంపీడీవో మహబూబ్ అలీ ఆదేశాల మేరకు, మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రాజా బాబు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ శుక్రవారం గట్లమల్యాల గ్రామం జరుగుతున్న పనుల క్షేత్రస్థాయిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సర్వర్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని,దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఎండల దృష్ట్యా శనివారం నుంచే పనుల వద్ద టెంట్లు,తాగునీటి సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ’విజయక్రాంతి’కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.వారి వెంట ఇంచార్జి సెక్రటరీ అనిల్ కుమార్,నిర్వాహకులు బుద్ది రవి తదితరులు ఉన్నారు.