2 July, 2026 | 12:22 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు

13-05-2026 12:55 AM

మఠంపల్లి, మే 12 : మండలంలోని భీల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ బానోతు రాముడు తెలిపారు. గ్రామంలో పలు పాత బోర్లను రిపేర్ చేయించి,ఫ్రెష్ చేయించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోరింగ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వేసవి కాలంలో ఈదురు గాలులు, విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు పనిచేయకపోయినా గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్,ఉపసర్పంచ్ కిషన్ నాయక్,గ్రామ నాయకులు మోతిలాల్ నాయక్, వార్డ్ మెంబర్లు బాబు నాయక్, భోజ్య నాయక్, నాగ నాయక్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.