హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ సమీపంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ హనుమాన్ ను పూజించడం ద్వారా మనలో భక్తి, ధైర్యం, సేవాగుణం పెంపొందుతుందన్నారు. సమాజంలో ఐక్యత, శాంతి నెలకొని ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, దేవాలయ చైర్మన్ కొత్త ఆంజనేయులు, ఈవో లక్ష్మణరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలగాని బాలు గౌడ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీనివాస్, నారాయణ ప్రవీణ్ రెడ్డి, మద్దెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






