9 April, 2026 | 6:33 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు

09-04-2026 04:53 PM

మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణ

మునుగోడు, ఏప్రిల్ 9(విజయక్రాంతి): రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు తీసుకున్నాము అని మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణ అన్నారు. గురువారం మునుగోడు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలంలోని మునుగోడు, గూడాపూర్, ఉకోండి, చల్మెడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను  ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.ఏ గ్రేడ్‌కు రూ.2389, బి గ్రేడ్‌కు రూ.2369 ధరలను ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పాలకూరి రమాదేవి, నరసింహ గౌడ్, నన్నురి భూపతి రెడ్డి, బండమీది యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, ఉప్పరబోయిన నరసింహ, బొమ్మరబోయిన మంగమ్మ, కాంగ్రెస్ మండల పార్టీ నాయకుడు భీమనపల్లి సైదులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేంరెడ్డి సురేందర్ రెడ్డి, వేంరెడ్డి జితేందర్ రెడ్డి, అలాగే ఏఈఓలు రమేష్, నిఖిల్, వాజిద్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పందుల స్వామి, యాసరాని దినేష్, సొసైటీ ఇంచార్జ్ కె. రమేష్, సొసైటీ సెక్రటరీ పాలకూరి సుఖేందర్ గౌడ్, అశోక్ రెడ్డి, నాగరాజు, సైదులు, మహేష్, చంద్రశేఖర్, అనిల్ ఉన్నారు.