9 April, 2026 | 6:31 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం

09-04-2026 04:56 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి లో గల ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరావు కి సత్తుపల్లి స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా బస్ డ్రైవర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ప్రతి డ్రైవర్ కు ప్రతి సంవత్సరం రెండు జతలు యూనిఫాం అందించాలన్నారు అదేవిధంగా ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం డ్రైవర్స్ కి కల్పించాలని అన్నారు ప్రతి స్కూల్ బస్సులో క్లీనర్స్ను ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా ఏడాదికి సరిపడా వేతనాన్ని డ్రైవర్లకు అందజేయాలని డిమాండ్ చేశారు ప్రతినెల కనీసం ఒక్క సెలవు అయినా ఇవ్వాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కోరారు ఈ సందర్భంగా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.