29 August, 2026 | 9:02 PM

అర్హులంద‌రికి సంక్షేమ ప‌థ‌కాలు

29-08-2026 07:20 PM

మునిప‌ల్లి ఆగస్టు 29 ( విజయక్రాంతి ):  ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు  ల‌బ్దిదారుల‌కునేరుగా చేరేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని  రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ మంతూరి సుధాక‌ర్ రెడ్డి, డిప్యూటీ  త‌హ‌సీల్దార్ ప్ర‌దీప్ , కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు స‌తీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ‌ల ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్  అన్నారు.  ఇందులో భాగంగానే మండ‌లంలోని మ‌ల్లారెడ్డిపేట,మొగ్దుంప‌ల్లి త‌దితర గ్రామాల్లో ల‌బ్దిదారుల‌కు నూత‌న స్మార్ట్ కార్డుల‌ను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన వారంద‌రికి ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు మ‌రింత సుల‌భంగా అంద‌నున్నాయ‌ని  తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జీపీఓ రాజు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి హ‌ర్ష, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్య‌క్షుడు మాధ‌వ‌రెడ్డి, యూత్ అధ్య‌క్షుడు సురేష్, నాయ‌కులు మొగుల‌య్య,  విజేంద‌ర్ రెడ్డి, మొగ్దుంప‌ల్లి గ్రామ పెద్ద లు బాయికాడి ఈశ్వ‌ర‌ప్ప, చాంద్ పాషా ప‌టేల్, వీర‌న్న, ఫిరోజ్ ఖాన్, ఇస్మాయిల్, ష‌కీర్ ఖాన్, ప్ర‌మోద్, సునీల్‌, ఏస‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.