డిఎలు దూరం పిఆర్సి మాయం
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): తెలంగాణలోని ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావలసిన డీఏలు, పిఆర్సిల ముచ్చట ఏమైందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మీసాల మల్లిక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు అయ్యాయని, ఎన్నికల మాటలు అన్ని కలలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగులో ఉన్న మూడు డిఏలు ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న జిపిఎఫ్ సొమ్ములు అలాగే టీఎస్ జిఎల్ఐ డబ్బులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
కానీ అవన్నీ ఇవ్వకపోగా పెండింగ్ డీఎల్ ల సంఖ్య ఇంకా మూడు కలుపుకొని ఆరుకు చేరిందని, పిఆర్సి ఊసే లేదని డిఎపిఆర్సిల కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వెయ్యు నూట పదహారు కండ్లతో ఎదురు చూస్తుందని అన్నారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని ఊదరగొట్టిన ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల దగ్గర నుండి వారి మూల వేతనంలో 1.5% చొప్పున వసూలు చేసి నాలుగు నెలలు గడిచినప్పటికిని ఆ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీంకు అతిగతి లేదని అది కూడా అందని ద్రాక్షలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సిపిఎస్ విషయంలో సిపిఎస్ బాధితులందర్నీ ఓ పి ఎస్ లో చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే లేదని , ప్రభుత్వంలోకి రాకముందు అన్ని హామీలను గుర్తించి ఇప్పుడు ఏ ఒక్క హామీను కూడా నిలబెట్టుకోకపోవడం ఉద్యోగులను నిలువునా ముంచడమేనని, ఇకనైనా ముఖ్యమంత్రి గారు చొరవ చూపి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల హక్కులను కాపాడి ఉద్యోగులకు విధిగా ఇవ్వవలసిన డిఏలు పిఆర్సి ని ఇవ్వగలరని ప్రభుత్వాన్ని మీసాల మల్లిక్ డిమాండ్ చేయడమైనది.






