calender_icon.png 10 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల నివారణకు చర్యలు..

27-05-2025 06:17:35 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు జరుగుతున్నందున, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో కలిసి అచ్చంపేట గ్రామశివర్లో గల రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఓపెన్ చేయడానికి వీలు లేకుండా దానికి వెల్డింగ్ చేపియడం జరిగింది. ఇదే మాదిరిగా అన్ని గ్రామాల రైతులకు తమ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లకు విద్యుత్ సిబ్బందితో కలిసి వెల్డింగ్ చేపించుకోవాలని, తద్వారా ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు అరికట్టవచ్చు అని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ సూచించారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శీను, లైన్ మెన్ షేరు తదితరులు ఉన్నారు.