విద్యుదాఘాతంతో మెకానిక్ దుర్మరణం
మేడ్చల్ అర్బన్ ఆగస్టు 8(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని చెక్పోస్ట్ సమీపంలో హెచ్కేజీఎన్ హైడ్రాలిక్ ప్రెస్ వద్ద పనిచేస్తున్న మెకానిక్ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ పోలీసులు తోటి కార్మికులు తెలిపిన వి వరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెంది న సునీల్ రామ్ (26) మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఉన్న హెచ్కేజీఎన్ హైడ్రాలిక్ ప్రెస్లో మెకానిక్గా పనిచేస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షిఫ్ట్ వి ధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు.తీవ్రంగా గాయపడిన సునీల్ రామ్ ఘటనా స్థ లంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘట నా స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.






