బ్యాంకుల్లో ఇంటి దొంగలు!
- ఉద్యోగులే సూత్రధారులు
- ముంబైలోని ఓ బ్యాంకులో రూ.16 కోట్ల కుంభకోణం
- వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు అక్రమంగా బదిలీ
- ‘మేకర్ వ్యవస్థ ఉన్నా నిర్వీర్యం
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు బయటి నుంచి వచ్చే సైబర్ నేరగాళ్లే కాదు.. బ్యాంకు లో పని చేసే ఉద్యోగుల నుంచీ ముప్పు పొంచి ఉంది. తాజాగా ముంబైలోని ఓ బ్యాంక్‌లో వెలుగు చూసిన భారీ మోసం ఇందుకు నిదర్శనం. బ్యాంకులో పని చేస్తున్న 30 ఏళ్ల వయసున్న అధికారి మూడేళ్ల పా టు వృద్ధ ఖాతాదారుల డిపాజిట్లను అక్ర మంగా బదిలీ చేసి రూ.16 కోట్లు కొల్లగొట్టాడు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్ రైలులో నిందితుడి(వివేక్ అనుకుందాం)ని అరెస్టు చేశారు.
పాస్‌వర్డ్‌తోనే దోపిడీ
స్కాం జరిగిన ముంబైలోని బ్యాంకు మేనేజర్ తన లాగిన వివరాలను సదరు నిందితుడితో పంచుకోవడంతో కీలకమైన సిస్టమ్ యాక్సెస్ అ తడి చేతికి వచ్చింది. తన పాస్‌వర్డ్‌తో పాటు మేనేజర్ పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తూ ‘మేకర్ చెకర్’ భద్రతా విధానాన్ని నిర్వీ ర్యం చేశాడు. డార్మెంట్ ఖాతాలను గుర్తించి, వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముందుగానే ర ద్దు చేసి సొమ్మును ఇతర ఖాతాలకు మళ్లించాడు.పీఎఫ్, సేవింగ్ ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నాడు.
ఏళ్ల తరబడి అదే శాఖలో పనిచేసిన వివే క్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టేవాడు కాదు. దీంతో అతడికిపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. చివరకు ఒక రోజు తన తండ్రి అనారోగ్యం కారణంగా సెలవు తీసుకోవడంతో అతడి స్థానంలో పని చేసిన ఉద్యోగికి డార్మెంట్ ఖాతాల్లో అసాధారణ లావాదేవీలు కనిపించాయి. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. మూడేళ్లుగా ఆడిట్‌కు చిక్కకుండా శాఖ నుంచి రూ.16 కోట్లు బయటకు వెళ్లినట్లు ఫోరెన్సిక్ పరిశీలనలో తేలిం ది. ఆ డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టినట్లు ఈడీ కస్టడీలో ఒప్పుకున్నాడు.
ఉద్యోగులకే వ్యవస్థపై పట్టు
బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకే బ్యాంకింగ్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. దీంతో వ్యవస్థలోని బల హీనతలను ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల వ యస్సులో బ్యాంకు ఉద్యోగాల్లో చేరే అధికారులు సాధారణంగా ఐదు నుంచి పదేళ్లపా టు ఒకేచోట పనిచేస్తుంటారు. ఆ సమయం లో శాఖ కా ర్యకలాపాలపై పూర్తి అవగాహన పెంచుకుంటారు. 2025 సెప్టెంబర్‌లో వెలుగుచూసిన అ ల్వార్ కేసు దీనికి ఉదాహరణ.
అక్క డ ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెం దిన కొందరు ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరించా రు. నకిలీ ఖాతాలను తెరవడానికి తమకు ఉన్న ప్రత్యేక సిస్టమ్ యాక్సెస్‌ను ఉపయోగించి, సుమారు రూ. 500 కోట్ల మ్యూల్ అకౌంట్’ నెట్‌వర్క్‌ను ని ర్మించేందుకు సహకరించినట్లు ఆరోపణ లు వచ్చాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ‘మేక ర్- చెకర్’ కీలకమైంది. రూ.16 కోట్ల స్కామ్ జరిగిన ముంబైలోని బ్యాంక్‌లో ‘మేకర్- ను సదరు నిందితుడు నిర్వీర్యం చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ జరిగింది.
భారీ మోసాలన్నీ ఉద్యోగుల ప్రమేయంతోనే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకు మోసాల మొత్తం విలువ రూ. 36,014 కోట్లకు పెరిగింది. అనంతరం సవరించిన గణాంకాల ప్రకారం అది రూ.32,803 కోట్లుగా నమోదైంది. ఇది 2023 పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అదే సమయంలో నమోదైన మోసం కేసుల సంఖ్య 36,060 నుంచి 23,722కు తగ్గింది. మొత్తం మోసాల విలువ రూ. 48,021 కోట్లకు పెరిగింది. అయితే నమోదైన కేసుల సంఖ్య 10,114కు తగ్గింది. వీటిలో భారీ మోసాలు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయంతో జరిగినవే.
తమల్ బంద్యోపాధ్యాయ్, బ్యాంకర్స్ ట్రస్ట్






