25 May, 2026 | 1:18 PM

పోలీస్ నిఘాలో మెదక్

17-06-2024 12:25 AM
  • గోవుల తరలింపుపై చెలరేగిన ఇరువర్గాల ఘర్షణ
  • పోలీసు పహారా మధ్య బంద్ ప్రశాంతం
  • 45 మందిపై కేసు నమోదు
  • పలువురి ముందస్తు అరెస్టు

మెదక్, జూన్ 16 (విజయక్రాంతి): గోవుల తరలింపు, జంతువధ విషయంలో శనివారం మెదక్‌లో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో  పట్టణంలో ఉద్రిక్తత నెలకొన్నది. బీజేపీ ఇచ్చిన పిలుపునిచ్చిన పిలుపు మేరకు ఆదివారం పట్టణం లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పోలీసు లు రోజంతా పట్టణంలో 144 సెక్షన్ అమ లు చేశారు. ప్రధాన కూడళ్లలో పహారా కాసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. పోలీస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఓ వర్గానికి చెందిన కొందరు వాహ నంలో గోవులను కబేళాకు తరలిస్తున్నారు. ఈక్రమంలో మరోవర్గానికి చెందిన వ్యక్తులు వాహనాన్ని అడ్డుకున్నారు.

వాగ్వాదం ఘర్షణకు దారి తీయగా, పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జి చేశారు. ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. ఘటనపై పోలీసులు మొత్తం 45 మందిపై కేసులు నమో దు చేశారు. కొందరు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తమ వర్గానికి చెందిన వ్యక్తులపై జరిగిన దాడికి నిరసనగా ఆ వర్గం ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. అప్రమత్తమైన పోలీసులు సమస్యాత్మక ప్రాంతా ల్లో భారీగా మోహరించారు. పట్టణంలో పికెటింగ్ చేపట్టారు. ఓ వర్గానికి చెందిన ఎని మిది మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  ఎస్పీ బాలస్వామితో కలిసి మల్టీజోన్ ఐజీ రంగనాథ్ పట్టణంలో పర్యటించారు. 20 ఏళ్ల క్రితం మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఆ తరహా  అల్లర్లు మళ్లీ ఎప్పుడూ చోటుచేసుకోలేదు. తాజాగా మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మెదక్‌వాసులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.