25 May, 2026 | 2:01 PM

మెదక్ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా

17-06-2024 12:25 AM

బాధితుల పక్షాన నిలబడాలని పోలీసులకు సూచన

హైదరాబాద్, జూన్ 1 6(విజయక్రాంతి): మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.  సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడంకానీ, అమాయకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలు కానీ చేపట్టొద్దని స్పష్టీకరించారు. మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. శాంతిభద్ర తలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపా తంగా వ్యవహరించాలని ఆదేశించారు.