calender_icon.png 20 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

20-12-2025 12:20:29 AM

ఏర్పాట్లపై ఆర్టీసీ ఆర్‌ఎం సమావేశం

ముకరంపుర, డిసెంబరు 19 (విజయ క్రాంతి): జనవరి 2026 లో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై నగరంలోని బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరములో డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇంఛార్జులు, మెకానికల్ ఇంఛార్జుల తో సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ ఎం మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని 6 ఆపరేటింగ్ పాయింట్లు గోదావరిఖని, హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని ద్వారా మేడారానికి నడుపనున్న 700 బస్సులకు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మత్తులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణము జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశములో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి రెడ్డి, పి. మల్లేశం, డిపో మేనేజర్లు ఎం. నాగభూషణం, ఎన్. వెంకన్న, వి. రవీంద్రనాథ్, ఐ. విజయమాధురి, ఎం. శ్రీనివాస్, వి. శ్రవణ్ కుమార్, కె. కల్సన, ఎప్. మనోహర్, టి. దేవరాజు, ఎ. ప్రకాశ రావు, బి. శ్రీనివాస్ పాల్గొన్నారు.