calender_icon.png 3 January, 2026 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా పాయింట్

03-01-2026 12:00:00 AM

బండారం బయట పడుతుందనే..

మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 2 (విజయక్రాంతి): ‘కేవలం స్పీకర్ మైక్ ఇవ్వ లేదనే కారణంతో సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేయడం బీఆర్‌ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనం. 2018లో తాము అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ నిరసన తెలిపితే ఏకంగా సభ్యత్వాలే రద్దు చేసిన చరిత్ర హరీశ్‌రావు మరిచిపోయారా.. ఆనాడు ప్రతిపక్షం సభను బహిష్కరించలేదు. కానీ నేడు వాస్తవాలు, వారి సంతకాలు, బం డారం బయట పడుతుందనే భయంతోనే డ్రామాలు చేస్తున్నా రు’ అని  మంత్రి జూ పల్లి కృష్ణారావు మం డిపడ్డారు. పాలమూరు జిల్లాలో వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే.. రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని, పాలమూరు- రంగారెడ్డిని మాత్రం 25 శాతం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

చర్చకు రాకుంటే తప్పు ఒప్పుకున్నట్టే..

మంత్రి వాకిటి శ్రీహరి

ప్రజలకు నిజాలు చెప్పాలనుకుంటే అ సెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేష న్ ఇవ్వాలి కానీ, పార్టీ ఆఫీసుల్లో ఇస్తే ఏం లాభం. 299 టీఎంసీలు మాకు చాలు అని కేసీఆర్, హరీశ్‌రావు చేసిన సంతకాలు రేపు టేబుల్ చేస్తాం అనగా నే భయంతో పారిపోయారు. మీరు సభకు రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని మంత్రి శ్రీ హరి తెలిపారు.

బీజేపీతో దోస్తీ కోసమే దాటవేత

విప్ ఆది శ్రీనివాస్

ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించిన అంశంపై చర్చ జరగాల్సి ఉందని, ఢిల్లీలో బీజేపీతో ఉన్న దోస్తీ ఎక్కడ చెడిపోతుందో అనే భయంతోనే హరీశ్‌రావు సభ నుంచి వెళ్లిపోయారని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన కూతురు కవిత కోరుతున్నా.. ఆయన రావ డం లేదన్నారు. ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారె డ్డి డిజైన్ ఎవరు మా ర్చారో, ఎవరి హయాంలో ద్రోహం జరిగిం దో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

హైదరాబాద్‌లో ఇక 300 డివిజన్లు

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. వార్డుల పునర్విభజనలో గతంలో జరిగిన తప్పుల వల్ల అనేక ఫిర్యాదులు వచ్చాయని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు 300 డివిజన్లుగా మారుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని తెలిపారు. సీ ఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అన్ని జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన నగర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.