03-01-2026 12:02:00 AM
మేడ్చల్ అర్బన్, జనవరి 2 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,డిఈ అనురాగ్,ఏఈ మమతలను 297,298వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినట్లు మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్, మేడ్చల్ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షులు సింగరేణి పోచయ్య,ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్,మేడ్చల్ మాజీ అధ్యక్షులు కర్కాల వరదా రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు జాకట దేవా, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ , నాయకులు చెరువుకొమ్ము శేఖర్ గౌడ్,బి మధుకర్ యాదవ్, బిపిటి రాజు,గర్దాస్ నరేందర్, సద్ది ప్రకాష్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్,వేముల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.