28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు

15-03-2026 05:10 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో సిబ్బంది, గ్రామపంచాయతీ కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు.

భిక్కనూర్, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, ఇసనపల్లి గ్రామాల్లో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు దివ్య, ఆరోగ్య కార్యకర్తలు శ్యామల, మంజుల, మాధవి, రాజమణి, స్వరూప, హేమలత, యశోద, ఎంఎల్హెచ్‌పీ ప్రశాంత్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.