15 March, 2026 | 6:21 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం

15-03-2026 05:07 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందిని వారి సేవలను ప్రశంసిస్తూ ఆదివారం సన్మానించారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్యం నిర్వహణలో వారు చేస్తున్న కృషిని గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

గ్రామాభివృద్ధి పనుల్లో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పాత లక్ష్మీ, ఉప సర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు ఈర స్వామి,శ్రీనివాస్,మాధవ రెడ్డి,నట్ట లింగం,రాకేష్, వార్డుసభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.